- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పుట్టుక.. చావు బీఆర్ఎస్‌లోనే: హరీశ్ రావు ఎమోషనల్ కామెంట్స్
తన పుట్టుక, చావు బీఆర్ఎస్‌లోనే అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ (KCR) మీద ఒట్టేసి బీజేపీలో చేరబోనని హరీశ్ రావు (Harish Rao) చెప్పగలరా అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు అన్నారు. 4 పార్టీలు మారిన ఆయనకు నా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉంటుందా అని ఫైర్ అయ్యారు. తాను జీవితాంతం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటానని వందసార్లు చెప్పానని గుర్తు చేశారు. అదే విషయాన్ని మరో 100 సార్లు చెబుతానని స్పష్టం చేశారు. నా పుట్టుక బీఆర్ఎస్‌లోనే.. చావు కూడా బీఆర్ఎస్‌లోనే అని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి మోడీ, బీజేపీ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని హరీశ్ రావు అన్నారు.






