జూబ్లీహిల్స్​లో ముస్లింలు కాంగ్రెస్​వైపే : మంత్రి అజారుద్దీన్​

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ లో వంద శాతం స్ట్రైక్​రేట్​తో గెలుస్తామని, ఆ నియోజవకవర్గంలో పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్ విమర్శించారు.

జూబ్లీహిల్స్​లో ముస్లింలు కాంగ్రెస్​వైపే : మంత్రి అజారుద్దీన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ లో వంద శాతం స్ట్రైక్​రేట్​తో గెలుస్తామని, ఆ నియోజవకవర్గంలో పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. ముస్లింలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని, బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం గాధీ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో అజారుద్దీన్​మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఇతర పార్టీల ప్రచారాలు ఎక్కడ కనిపించడం లేదని, నియోజకవర్గం ఓటర్లంతా నవీన్ యాదవ్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. ఆరు నెలలు మంత్రి అని నా పైన విమర్శలు చేస్తున్నారని, విమర్శలు, మాటలు ఎవరైనా చెప్తారని ఆయన కొట్టి పారేశారు.

తన శాఖలో ఉన్న పెండింగ్​సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని, రెండు ఏళ్ళుగా ముస్లింలు విద్యార్థులు స్కాలర్షిప్ లు రాలేదని, వంద శాతం వచ్చే విధంగా కృషి చేస్తానని అజారుద్దీన్​హామీ ఇచ్చారు. హైదరాబాద్ క్రికెట్ కోసం తాను చాలా కృషి చేశానని, తన పైన వేలు చూపించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. తనకు ఇచ్చిన శాఖలతో సంతృప్తిగా ఉన్నాట్లు ఆజారుద్దీన్​తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మాట్లాడుతూ కేసీఆర్ , కేటీఆర్ పదేళ్లలో ముస్లిం సోదరులు కోసం ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చేసిందేమిటో చెప్తే కాంగ్రెస్ పార్టీ రెండు ఏళ్ళులో ఏమి చేశామో చెప్తామన్నారు. తమ పార్టీ ముస్లింలు కోసం నిలబడుతుంటే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు.

తెలంగాణలో పలు విద్యాసంస్థలును కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, ఎక్కడ కూడా హిందు ముస్లింలు అనే భేదం చూపించలేదన్నారు. తాము ఉర్దూ టీచర్లు పోస్టులు ఇచ్చామని, ముస్లింల కోసం ఒక్క కాలేజీ అయిన బీఆర్ఎస్ ఇచ్చిందా అని షబ్బీర్​అలీ ప్రశ్నించారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు 1248 మంది ముస్లిం విద్యార్థులు చదువుతున్నారని, 682 మంది ఫ్రీ సీట్లు పొందారన్నారు. ముస్లిం సోదరులు నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీ గెలిపించాలని షబ్బీర్ ఆలీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, పదవులు, అవకాశాలు సమయానుకూలంగా వస్తాయన్నారు.

Next Story