ఒత్తిడిని తగ్గించడానికి అదే ఉత్తమమైన మార్గం: ఫారూఖీ

by Gantepaka Srikanth |

జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ ఆదాపై దృష్టి సారించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని టీజీఎస్​పీడీసీఎల్​సీఎండీ ముషారఫ్ ఫరూఖీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఒత్తిడిని తగ్గించడానికి అదే ఉత్తమమైన మార్గం: ఫారూఖీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ ఆదాపై దృష్టి సారించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని టీజీఎస్​పీడీసీఎల్​సీఎండీ ముషారఫ్ ఫరూఖీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మనం ఉపయోగించే విద్యుత్‌లో ఎక్కువ భాగం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అవుతోందని, అదే విద్యుత్ ఆదా చేయడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని వినియోగదారులు గమనించాలన్నారు. విద్యుత్‌ను ఆదా చేయడం పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక ముఖ్యమైన మార్గం కూడానని, సులువైన విద్యుత్ ఆదా పద్ధతులను అవలంబించడం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. సీలింగ్ ఫ్యాన్లను సరైన వేగంతో సెట్ చేసుకుని వినియోగించుకోవాలన్నారు. అలాగే ఎయిర్ కండిషనర్ల కోసం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సిఫారసు చేసిన 24 -26 శాతం సెంటిగ్రేడ్​ఉష్ణోగ్రతలను సెట్ చేయాలని, ఫిల్టర్లను నెలవారీగా శుభ్రం చేసుకోవాలంటూ పలు అంశాలను సీఎండీ గుర్తు చేశారు

Next Story