మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత ప్రారంభం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-23 07:50:27  IST  )

హైదరాబాద్ నగర ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూల్చివేతకు అధికారులు నిర్ణయించారు.

మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన మూసారాంబాగ్ బ్రిడ్జి (Moosarambagh Bridge) కూల్చివేతకు అధికారులు నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జంట నగరాల జలాశయాలు ఉప్పొంగాయి. దీంతో మూసీ నది ఉప్పొంగడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. గతంలో కూడా నగరంలో భారీ వర్షాలు కురిసిన ప్రతీ సారి ఈ బ్రిడ్జి మునిగిపోయి.. ప్రయాణాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఆ పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నప్పటికి.. పనులు మందకొడిగా నడుస్తున్నాయి.

నగరంలో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన ఎన్నో వరదలను తట్టుకొని పాత మూసారాంబాగ్ బ్రిడ్జి గత 40 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలకు సేవలు అందిస్తుంది. నిత్యం వరదల కారణంగా తీవ్రంగా బ్రిడ్జి దెబ్బతిన్నట్లు ఇటీవల నిపుణులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో పాత బ్రిడ్జి (Old bridge) ప్రమాదకరంగా మారిందని సూచించడంతో కూల్చివేతకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం ప్రత్యేక వాహనాలతో మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు.

Next Story