జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌కు మున్నూరు కాపు, కాపుల మద్దతు

by Malleboina Mahesh |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మున్నూరు కాపు, కాపులు మద్దతు తెలిపారు. ఆదివారం హైదరాబాద్​లో మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌కు మున్నూరు కాపు, కాపుల మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మున్నూరు కాపు, కాపులు మద్దతు తెలిపారు. ఆదివారం హైదరాబాద్​లో మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు శ్యామ్ మోహన్, ఈరవత్రి అనిల్, వినయ్ , ఆకుల లలిత, కేకే మహేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సత్తు మల్లేష్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్ట పరంగా న్యాయ పరంగా ముందుకు పోతున్నామన్నారు. బలహీన వర్గాలు ఐక్యంగా దీనిని సాధించుకోవాలని, 22 నెలల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించి ముందుకు పోతున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు.జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మన బలహీన వర్గాల బిడ్డ..ఉన్నత విద్యావంతుడు ..స్థానికుడు ఆయనను మీరంతా ఆశీర్వదించాలన్నారు. ఆనియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినట్లే జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి పొన్నం చెప్పారు.

అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయని, రేషన్ కార్డులు..సన్నబియ్యం వస్తున్నాయి..200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కి గ్యాస్, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అందిస్తున్నామన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

టీపీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​గౌడ్​మాట్లాడుతూ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క రోజులో బీసీ రిజర్వేషన్లు చట్టంగా మారుతుందని, బీసీలు ఏకం కారనే భరోసా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఉందని విమర్శలు గుప్పించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు బలం ఇచ్చింది రాహుల్ గాంధీ అని, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ బీసీలకు నాయకత్వ అవకాశాన్ని కల్పించిందని, బీఆర్ఎస్ లో బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బీసీ బిడ్డ హనుమంతు రావుకు పీసీసీ అవకాశం కల్పించారని, ప్రతి ఒక్కరికి కులాభిమానం ఉన్న పర్వాలేదు కానీ కులపిచ్చి ఉండకూడదని, బీసీలు ఐక్యంగా ఉంటేనే బలం అని మహేష్​కుమార్​గౌడ్​అన్నారు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చిందని, బీసీలందరూ ఏకమై నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, బీసీల తడాఖా చూపే అవకాశం వచ్చిందన్నారు.

Next Story