- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఉద్యోగుల బదిలీలు.. వెబ్ కౌన్సిలింగ్ సక్సెస్
మున్సిపల్ శాఖ పరిధిలోని ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ విజయవంతంగా పూర్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ శాఖ పరిధిలోని ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సాంకేతిక ఆధారిత విధానంలో నిర్వహించడం ద్వారా ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించారు. ఖాళీల వివరాలు, సీనియారిటీ జాబితాలు మరియు ఎంపికల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల సీనియారిటీ, అర్హతలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా బదిలీలు చేపట్టారు.ఖాళీల జాబితా, ఎంపికల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టారు. ఉద్యోగులు స్వయంగా తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతోపాటు ఉద్యోగులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. దీంతో బదిలీల ప్రక్రియ ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా సమర్థవంతంగా పూర్తయిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
కమిషనర్ శ్రీదేవికి ధన్యవాదాలు : టీఎంసీఏ
మున్సిపల్ శాఖ ఉద్యోగుల సాధారణ బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సక్సెస్‌ఫుల్ పూర్తిచేసిన సందర్భంగా కమిషనర్ టీకే.శ్రీదేవికి తెలంగాణ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్(టీఎంసీఏ) అధ్యక్షులు టి. కృష్ణ మోహన్ రెడ్డి, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, న్యాయబద్ధమైన విధానాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం ఆదర్శప్రాయమని వారు పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డా. టి.కె. శ్రీదేవి నాయకత్వంలో అధికారులు, సాంకేతిక బృందం, ఉద్యోగ సంఘాల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు తెలిపారు.






