- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Municipal Elections: పార్టీల ఓటింగ్ శాతాలు ప్రకటించిన ఈసీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పురపాలిక, నగరపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు(Telangana Municipal Elections) ప్రశాంతంగా ముగిశాయి. పురపాలిక, నగరపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అటు కార్పొరేషన్లలో కూడా హస్తం హవా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంతశాతం ఓటింగ్ వచ్చింది అనే వివరాలను శనివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ 39.8 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 28.7 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది. అటు బీజేపీకి 15.6 శాతం, ఎంఐఎం 3.2 శాతం, AIFB 1.5 శాతం, సీపీఐ 1.3 శాతం, సీపీఎం 0.5 శాతం ఓట్లు వచ్చాయని తెలిపింది.
మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డుల్లో విజయం సాధించింది. అదే సమయంలో 116 మున్సిపాలిటీలకు గానూ 64 మున్సిపాలిటీల్లో హస్తం పాగా వేసింది. ఆ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ 717 వార్డులను గెలుచుకుంది. 13 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది. మరోవైపు.. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 256 వార్డుల్లో జయకేతనం ఎగువేశారు.






