- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Municipal Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 62 శాతం పోలింగ్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Telangana Municipal Elections) ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.09 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 5 గంటల తర్వాత క్యూలో నిల్చున్న వారికి ఏ సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులను అదుపుచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేశారు. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.






