TG: పోలింగ్ కేంద్రం ముందు.. ఓ ఇంట్లో గుమిగూడిన యువకులు

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో మరోచోట ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

TG: పోలింగ్ కేంద్రం ముందు.. ఓ ఇంట్లో గుమిగూడిన యువకులు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Telangana Municipal Election) నేపథ్యంలో రాష్ట్రంలో మరోచోట ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో ఉద్రిక్తత నెలకొంది. శేరిగూడ పోలింగ్ కేంద్రం ఎదుట ఓ ఇంట్లో భారీగా యువకులు గుమిగూడారు. విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. యువకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, యువకులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు ఆ యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పోలీసుల వాహనానికి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. ఇంట్లో ఉన్నవారిని పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులతో యువకులు ఘర్షణకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు.. కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిఛార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు యువకులు గాయపడ్డారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.

Next Story