- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడకక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడకక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 11 గంటల వరకు ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 28.48 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 52,17,413 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 14,85,747 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీల్లో సగటున 30.62 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లలో ఓటింగ్ నెమ్మదిగా సాగుతూ 23.26 శాతం పోలింగ్ నమోదైంది.
జోగులాంబ గద్వాల మున్సిపాలిటీలో పోలింగ్ జోరు..
చిన్న మున్సిపాలిటీల్లో ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల మున్సిపాలిటీలో 47.52 శాతం, అలంపూర్‌లో 40.84 శాతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 45.05 శాతం, భద్రాద్రి కొత్తగూడె జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో 45.18 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా నిర్మల్ మున్సిపాలటీలో పరిధిలో 14.30 శాతం, నారాయణఖేడ్2లో 11.10 శాతం, యాద్రాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో 11.98 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో..
రాష్ట్రంలోని ఏడు ప్రధాన కార్పొరేషన్లలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో పరిధిలో అత్యధికంగా 27.72 శాతం పోలింగ్ నమోదైంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌లో 28.46 శాతం, అతి కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్‌లో 24.36 శాతం, రామగుండం కార్పొరేషన్‌లో 24.31 శాతం, అన్నింటి కంటే అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 18.94 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అయితే, ఎండ ప్రభావం పెరగక ముందే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం సమయానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.






