- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల అప్‌డేట్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ అయింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు ఓటరు జాబితా తయారీకి ఎస్‌ఈసీ కసరత్తు చేయనుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల(నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం)లో ఓటర్ జాబితా తయారీ ప్రక్రియ కొనసాగనుంది. కాగా, ఇటీవలే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు ప్రమాణస్వీకారాలు సైతం పూర్తిచేసుకుని పరిపాలనపై దృష్టిపెట్టారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ఎన్నికలు నిర్వహిస్తారని బలమైన ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు రూ.700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి చివర్లో పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ఆఫీసర్ల పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలకవర్గం, వచ్చే మే నెలతో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్లాంటి పాలకవర్గాల గడువు ముగియనుంది. దీంతో వీటన్నంటిని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా? లేక గతంలో లాగానే విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. తాజాగా మున్సిపల్ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ప్రారంభించడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






