శ్రీరామనవమి రోజు.. రాజాసింగ్‌కు ముంబై పోలీసుల షాక్..

by Malleboina Mahesh |   (  Updated:2023-03-30 12:20:35  IST  )

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

శ్రీరామనవమి రోజు.. రాజాసింగ్‌కు ముంబై పోలీసుల షాక్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 153ఎ1(ఎ) కింద కేసు నమోదు చేశారు. కాగా ముంబైలో జరగిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను హైదరాబాద్ పోలీసులు సైతం రాజాసింగ్ కు గతంలో నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చిన సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ హైకోర్టు షరతు విధించిన సంగతిని హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులలో పోలీసులు గుర్తు చేశారు.

Next Story