Mulugu: మల్లంపల్లి వాసుల కల నిరవేరింది.. మంత్రి సీతక్క ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2024-11-28 17:26:44  IST  )

దశాబ్దాల మల్లంపల్లి(Mallampally) వాసుల కల నెరవేరిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ట్విట్ చేశారు.

Mulugu: మల్లంపల్లి వాసుల కల నిరవేరింది.. మంత్రి సీతక్క ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: దశాబ్దాల మల్లంపల్లి(Mallampally) వాసుల కల నెరవేరిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ములుగు జిల్లా(Mulugu District) మల్లంపల్లి మండలాన్ని కొత్త రెవెన్యూ మండలంగా(New Revenue Mandal) రెవెన్యూ శాఖ అధికారికంగా ప్రకటించిందని, ములుగు(Mulugu) నియోజకవర్గానికి ఇది మరో మైలురాయి అని అన్నారు. ఈ నిర్ణయంతో మల్లంపల్లి వాసుల దశాబ్దాల కల నెరవేరిందని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని సాధించేందుకు అలుపెరగని పోరాటం చేసిన నివాసితులకు హృదయపూర్వక అభినందనలు తెలియ జేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తామని, ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో తిరుగులేని కృషి చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)కి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Next Story