ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ అరెస్టు

by Naga Rani Yarlagadda |

ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ తిప్పనేని రామదాసప్పను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్‌ సొసైటీ (Mudra Co-operative Society) ఛైర్మన్‌ తిప్పనేని రామదాసప్ప (Timmaneni Ramadasappa)ను తెలంగాణ సీఐడీ (Telangana CID) అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు సాయికిరణ్ ను కూడా అమరావతి (Amaravati)లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఐడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగాలు, అధిక వడ్డీల ఆశ చూపించి 2 వేలమందికి పైగా బాధితుల నుంచి రామదాసప్ప రూ.140 కోట్లు వసూలు చేశాడు. 2 వేలమందికి మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం సంప్రదించారు. జాబ్ కావాలంటే కొంత చెల్లించాలన్న షరతు పెట్టడంతో అడిగినంతా సమర్పించుకున్నారు.

ఆపై రైతుల నుంచి పెట్టుబడులు తీసుకు రావాలని, లేదంటే వారికి ఇచ్చే శాలరీ నుంచి కట్ చేస్తామని ఉద్యోగుల్ని వేధించారు. జాబ్ పేరుతో తీసుకున్న సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. బాధితుల ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. దీంతో తెలంగాణ సీఐడీ అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపారు.

Next Story