- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..మంత్రి పొన్నం ప్రభాకర్
మృగశిర కార్తి సందర్భంగా ఈనెల 8వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉబ్బస రోగులకు బత్తిన కుటుంబం చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

దిశ , హైదరాబాద్ బ్యూరో: మృగశిర కార్తి సందర్భంగా ఈనెల 8వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉబ్బస రోగులకు బత్తిన కుటుంబం చేపట్టనున్న చేప ప్రసాదం పంపిణీ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్లు సాయికుమార్, ఇతర అధికారులతో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఉబ్బస రోగుల కోసం 1.5 లక్షల చేప పిల్లలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు . అంతకుముందు చేప ప్రసాదం పంపిణీ లో భారీకెడ్లు ,క్యూ లైన్ లో ఇబ్బందులు ,భద్రత ఏర్పాట్ల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు . రెండు రోజుల ముందు నుండే రోగులు ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చే అవకాశం ఉందని , అందరీకి త్రాగునీరు, వైద్య సౌకర్యం, ఏర్పాటు చేయాలన్నారు.






