- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరి తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు!
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతలు ఎదురు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతలు ఎదురు చేస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటరు లిస్టును తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ నిర్ణయించింది. దీని ఆధారంగానే ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని చెబుతున్నారు. చట్ట పరంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని, లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జులైలో చివరి సారిగా ఓటరు జాబితా సవరణ
గత జులై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరి సారిగా ఓటరు జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం తో ఓటరు జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటరు జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడి నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి మూడో వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటరు జాబితా సవరణ తర్వాతే పోలింగ్స్టేషన్లను ఖరారు చేయనున్నారు.
మున్సిపాలిటిల్లో సవరణ
మున్సిపాలిటిల్లోనూ ఓటరు జాబితాను సవరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంత వరకు వార్డుల విభజన వివరాలు పంపించ లేదని తెలిసింది. వార్డుల విభజన పూర్తయినట్టు సమాచారం అందిస్తే కానీ ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. జులైలో ఓటరు జాబితా తయారు చేసిన తర్వాత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్య పేరు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చట్టంలోనూ ఉంది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఇలా 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇది ఉద్దేశ పూర్వకంగా జరగకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్విడుదల చేయడం, కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, సర్పంచ్ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటరు జాబితా సవరించడం సాధ్యం కాలేదు. ఈ సారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జాబితా సవరిస్తేనే ఎలక్షన్స్..
ఓటరు జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని, చట్ట పరంగా ఇక్కట్లు ఉంటాయని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.






