తెలంగాణలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే...

by Gantepaka Srikanth |

తెలంగాణలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే...

తెలంగాణలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే...
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని ఖర్గే, ప్రియాంక ఇద్దరూ మెచ్చుకున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి సంతృప్తిగా ఉందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు రావాలని పదే పదే బీఆర్ఎస్ అంటోంది.. ఒక వేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపై ఉన్నారని చెప్పారు.


మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఇందుకు నిదర్శనం అని అన్నారు. అంతేగాకుండా.. ఉపాధి హామీ చట్టం మార్పునకు వ్యతిరేకంగా గ్రామాల నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని కీలక ప్రకటన చేశారు. బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ‘జాతి పిత’గా దేశమంతా గౌరవిస్తోన్న మహాత్మా గాంధీ పేరును తొలగించడం యావత్ దేశాన్ని కించపరచడమేనని చెప్పారు. కేంద్రం మార్పులతో ప్రవేశ పెట్టిన గ్రామీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీబీ జీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ బిల్లు–2025తో రాష్ట్రాలపై మరింత భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే నూటికి నూరు శాతం ఈ పథకం కోసం నిధులు కేటాయించేదని.. కానీ, ఇప్పుడు 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాలను 40 శాతం భరించాలని అంటున్నారని, దీనివల్ల రాష్ట్రాలపై తీరని ఆర్థిక భారం పెరుగుతుందన్నారు.

Next Story