- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకుంటుంది
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకుంటుంది
జేఏసీ నేతలతో ఎంపీ వేం నరేందర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి రాజకీయ ప్రధాన సలహాదారులు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డితో కలిసి వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసింది. ఆర్టీసీ విలీన ప్రస్తుత పరిణామాలను వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. యూనియన్ ఎన్నికల కంటే ముందే, జూన్ 2వ తేదీన విలీనానికి సంబంధించిన అపాయింటెడ్ డే ను ప్రభుత్వం ప్రకటించేలా చొరవ చూపాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విడుదలకు తగిన నిధులు కేటాయించాలని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా కోరారు.
దీనిపై వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ... జూన్ 2న అపాయింటెడ్ డేట్ ప్రకటనతో పాటు, విలీన విధివిధానాల కోసం అధికారులు, కార్మిక సంఘాలతో కమిటీ వేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రాలో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగిన నష్టం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలన్నదే సీఎం సంకల్పమని, విలీనం సజావుగా సాగేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. కార్మికుల మనోభావాలను అర్థం చేసుకుని స్పష్టమైన హామీ ఇచ్చినందుకు వేం నరేందర్ రెడ్డికి జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో-కన్వీనర్లు యాదగిరి, బాబు, బుద్ద విశాల్, రవికిరణ్, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.






