- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ జీవో జారీ.. స్పందించిన బీజేపీ MP ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం బీసీ సంక్షేమశాఖ జీవో విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం బీసీ సంక్షేమశాఖ జీవో విడుదల చేసింది. తాజాగా ఈ జీవోపై బీజేపీ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య(MP R.Krishnaiah) స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అభినందనలు తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందనే నమ్మకం కలుగుతోందని అన్నారు. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.






