కేంద్రాన్ని ప్రశ్నించిన MP రఘువీర్.. స్పందించిన గజేంద్ర సింగ్ షెకావత్

by Gantepaka Srikanth |

కేంద్రాన్ని ప్రశ్నించిన MP రఘువీర్.. స్పందించిన గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్రాన్ని ప్రశ్నించిన MP రఘువీర్.. స్పందించిన గజేంద్ర సింగ్ షెకావత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించిన ఏ ఒక్క వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం లోక్ సభలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణలో మంజూరు చేసిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులు, వాటి సంఖ్యపైన ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణలో భారత పురావస్తు సర్వే మంజూరు చేసిన వాసరత్వ పరిరక్షణ ప్రాజెక్టులు లేవని, అధికార పరిధిలో ఎనిమిది కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలున్నాయని వెల్లడించారు.

ఈ రక్షిత స్మారక చిహ్నాలు, సంరక్షణ, ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణ నిరంతర ప్రక్రియ అని, వనరుల అవసరం, లభ్యత ప్రకారం ఇవి కొనసాగుతాయని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ప్రస్తుత స్మారక చిహ్నాలు మంచి సంరక్షణ స్థితిలో ఉన్నాయని, తమ మంత్రిత్వ శాఖ 2022‌‌- 23 సంవత్సరానికి రూ.15.50 కోట్లు, 2023- 24 రూ.14.38 కోట్లు, 2024 -25కి రూ.6.80 కోట్లు, 2025- 26 సంవత్సరానికి రూ.9కోట్లు ఈ నవంబర్ వరకూ కేటాయించామన్నారు.

Next Story