- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత వ్యాఖ్యలపై యువరాజు స్పందిస్తారా?: రఘునందర్ రావు
శాసనమండలిలో కల్వకుంట్ల కవిత చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలిలో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత ప్రశ్నలకు యువరాజు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు. బావ హరీష్ రావు, పెద్దాయన కేసీఆర్‌పైనా స్పందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షం, పాలకపక్షం నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు అని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు ఓకే.. రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి చేసిందేంటి? అని అడిగారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే తాను ముక్కలు అని అన్నారు. శాసనసభలో పాలమూరు, కృష్ణా జలాలపై మాట్లాడకుండా ఒకరిపై ఒకరు తిట్టుకోవడానికే సరిపోతుందంటూ అధికార, విపక్ష పార్టీలపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను తిట్టడం, కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ తిట్టడమే తప్పా.. చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదన్నారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరుకు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బీఆర్‌ఎస్‌నూ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. ఎవరేం చేసినా బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.
Read More... యువ పార్లమెంట్ వేదికగా ప్రభుత్వంపై రఘునందన్ నిప్పులు






