జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.. MP రఘునందన్ రావు జోస్యం

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని MP రఘునందన్ రావు జోస్యం చెప్పారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.. MP రఘునందన్ రావు జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా.. జూబ్లీహిల్స్‌లో జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని చెప్పారు. పదేళ్ల పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగిన మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కొత్త జీఎస్టీ విధానంతో దేశంలోని ప్రతీ ఇంటికి ప్రయోజనం చేకూరిందని అన్నారు. అభ్యర్థి ప్రకటనకు సంబంధించి బీజేపీ ఓ విధానం ఉందని అన్నారు. తప్పకుండా జూబ్లీహిల్స్‌(Jubilee Hills By-Election)లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. మరోవైపు హామీల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. తప్పకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీవైపే చూస్తారనే నమ్మకం తమకుందని అన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఉప ఎన్నిక టికెట్‌ దక్కుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయనతో జూటూరు కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ కూడా ఉపపోరులో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story