కవిత బీజేపీలో చేరతారంటూ వార్తలు.. స్పందించిన MP రఘునందన్‌ రావు

by Gantepaka Srikanth |

తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

కవిత బీజేపీలో చేరతారంటూ వార్తలు.. స్పందించిన MP రఘునందన్‌ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయడం చర్చనీయాంశంగా అయింది. అయితే ఆమె బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటినుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ పార్టీల్లో చేరబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా కవిత బీజేపీ(BJP)లో చేరబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. హరీష్‌ రావు - సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఒకే ఫ్లైట్‌లో వచ్చారనేది నిజం అని అన్నారు.

ఫ్లైట్‌లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారని చెప్పారు. కవిత రాజకీయాలకు దూరంగా ఉంటే వ్యక్తి కాదు.. తప్పకుండా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని చాలా కాలంగా తాము చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె చెప్పారని జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్‌కు చెప్పానని అయినా ఆ రోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిని పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. కవిత మాటలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా అవినీతి పునాదుల మీద విస్తరిచబడిందనేది అర్థమవుతోందన్నారు.

Next Story