సాయంత్రంలోపు చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్

by Ramesh Naini |   (  Updated:2025-08-08 10:33:29  IST  )

తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది.

సాయంత్రంలోపు చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు(Threatening call) కాల్ వచ్చింది. హైదరాబాద్‌లోనే ఉన్నాం.. సాయంత్రం వరకు చంపేస్తామని అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి హెచ్చరించారు. ఎవరు కాపాడుతారో చూద్దామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా (MP Raghunandan Rao) రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఆరోసారి.. ఇవాళ కూడా బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు మారోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గతంలోనూ ఛత్తీస్ గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్‌’ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టుల పేరుతో హెచ్చరించారు. గతంలోనూ హైదరాబాద్‌లోనే మా టీమ్ ఉందని మరికాసేపట్లోనే నిన్ను చంపేస్తాం అంటూ రెండు వేర్వేరు నంబర్ల నుంచి అగంతకులు కాల్స్ చేశారు. గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ రావడం చూస్తే.. అదును కోసం అగంతకులు ఎదురుచూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా సార్లు కాల్ వచ్చింది ఏం కాదులే అని నిర్లక్ష్యం వహించినప్పుడు ఏదైనా చేయాలని చూస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే రఘునందన్‌రావుకు చేసేది తీవ్రవాదులా? ఇంకా ఎవరైనానా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి 9404348431 నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.

Next Story