- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘8 మంది బీజేపీ ఎంపీలం రాజీనామా చేసేందుకు రెడీ’.. రఘునందన్ రావు సంచలన సవాల్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు.. అప్పటివరకు వేచి ఉండటం వేస్ట్.. ఉన్నపళంగా శాసనసభను రద్దు చేసి ఎన్నిలకు వెళ్దామా? అని అడిగారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని అన్నారు. తాము ఓట్ చోరీ(Vote Chori) చేస్తే.. మీరు ఎనిమిది సీట్లలో ఎలా గెలిచారని ప్రశ్నించారు. అసలు ఓట్ చోరీ చేసే అవకాశమే ఉంటే అసదుద్దీన్ ఒవైసీని గెలవనిస్తామా? అని అన్నారు.
అనవసర ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.. దమ్ము ఉంటే కాంగ్రెస్ ఎంపీలు అందరూ రాజీనామా చేయండి.. మేము కూడా ఎనిమిది మంది ఎంపీలం రాజీనామా చేస్తాం.. కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్దాం అని సవాల్ చేశారు. బీజేపీని అడిగి కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చారా? కుంటి సాకులు చెప్పకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని హితవు పలికారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ లోపంతోనే యూరియా కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చింది? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.






