కొత్త విమానాశ్రయాలకు వెంటనే భూసేకరణ జరపాలి : ఎంపీ రఘునందన్‌ రావు

by Ramesh Naini |

తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూసేకరణ జరిపి సహకరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు.

కొత్త విమానాశ్రయాలకు వెంటనే భూసేకరణ జరపాలి : ఎంపీ రఘునందన్‌ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూసేకరణ జరిపి సహకరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రాలో ఎనిమిది ఎయిర్‌పోర్టులు ఉంటే, తెలంగాణ (భాగ్యనగరం)లో శంషాబాద్ రూపంలో ఒకే ఒక్కటి ఉందన్నారు. ఏటా 40 లక్షల ప్రయాణికుల సామర్థ్యం ఉన్న శంషాబాద్‌లో.. 2025-26 లెక్కల ప్రకారం ఇప్పటికే 35 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు.

రద్దీ దృష్ట్యా మోడీ ప్రభుత్వం మామునూరు, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ పనులు జరగాలని తాను కోరుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. అలాగే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండవ టెర్మినల్ నిర్మాణాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story