ఆర్.కృష్ణయ్య కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఆర్.కృష్ణయ్య కీలక ప్రకటన

ఆర్.కృష్ణయ్య కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య(R.Krishnaiah) డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని సంస్కరణలు చేసినా బీసీలకు న్యాయం జరుగడం లేదని ఆవేదన చెందారు. అన్ని రంగాల్లో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే అన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాలని తెలిపారు. బీసీలకు బీజేపీ వ్యతిరేకం అనడం అవాస్తవమని.. బీసీలకు మోడీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. బీసీల హక్కుల సాధన కోసం వచ్చే మార్చిలో భారీ బహిరంగ సభ పెడతామని కీలక ప్రకటన చేశారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కాగా, ఇటీవల బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ని ఎందుకు సమర్థించారు? అని ఎంపీ ఆర్‌ కృష్ణయ్యను బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బాలగోని బాలరాజుగౌడ్‌ ప్రశ్నించారు. ఆర్‌. కృష్ణయ్య బీజేపీ ఎంపీ హోదాలో ప్రధానమంత్రి పక్కనే కూర్చుంటారని, కానీ, 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

Next Story