MP Pappu Yadav: ఢిల్లీలో టీ కాంగ్రెస్ ధర్నా.. సౌత్ ఇండియాపై బిహార్ ఎంపీ సంచలన కామెంట్స్

by Prasad Jukanti |

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధర్నా కొనసాగుతోంది.

MP Pappu Yadav: ఢిల్లీలో టీ కాంగ్రెస్ ధర్నా.. సౌత్ ఇండియాపై బిహార్ ఎంపీ సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను (BC Reservations) 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదించాలని తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన మహా ధర్నా కొనసాగుతోంది. రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy Protest), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా టాపిక్ చర్చకు రావడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ఇండియా కూటమికి చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిహార్ కు చెందిన ఎంపీ పప్పు యాదవ్ (Pappu Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మార్పు, సామాజిక న్యాయం, పోరాటాలు దక్షిణ భారత దేశం (South India) నుంచే మొదలవుతాయని, దక్షిణాది ప్రజలు మార్పు కోసం పోరాడినప్పుడు కేంద్రంలో ఉన్న పేదల శత్రువులు ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇవాళ జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల పోరాటం ఉన్నత, బలహీన వర్గాల మధ్య కాదని సామాజిక మార్పు కోసమేననన్నారు. పెరియార్, అంబేద్కర్, ఫూలేల స్ఫూర్తి ఎవరికైనా ఉంటే అది కేవలం రాహుల్ గాంధీకి మాత్రమేనన్నారు. రాహుల్ గాంధీ పోరాటం కుర్చీకోసం కాదని ఓబీసీల కోసం అని చెప్పారు. పోరాటం చేసే ధీమా చనిపోయేంత ధైర్యం రాహుల్ గాంధీ సొంతం అన్నారు. కొట్లాడితేనే ఓబీసీ వాటా దక్కుతుందని చెప్పారు.

Next Story