Mithun Reddy : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2025-09-06 13:06:16  IST  )

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా అతను జైల్లో ఉన్నారు.

Mithun Reddy : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా అతను జైల్లో ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం అతనికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం సాయంత్రం ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి విడుదల అయ్యారు. కాగా సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయనకు కోర్టు ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే అభ్యర్థి కి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల అనంతరం ఈ నెల 11న సరెండర్‌ కావాలని మిథున్‌రెడ్డికి కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని, ముగ్గురి పాస్‌పోర్ట్‌లను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Next Story