విజయుడుపై దాడి చేయలేదు.. మేం అన్నదమ్ముల్లా ఉంటాం: ఎంపీ మల్లు రవి

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ‌యుడుపై దాడి చేసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ మ‌ల్లు ర‌వి స్పందించారు. అలంపూర్ లో కొన్ని శంకుస్థాప‌న‌లు జ‌రిగే స‌మ‌యంలో తాను, ఎమ్మెల్యే విజ‌యుడు క‌లిసి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని చెప్పారు.

విజయుడుపై దాడి చేయలేదు.. మేం అన్నదమ్ముల్లా ఉంటాం: ఎంపీ మల్లు రవి
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ‌యుడుపై దాడి చేసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ మ‌ల్లు ర‌వి స్పందించారు. అలంపూర్ లో కొన్ని శంకుస్థాప‌న‌లు జ‌రిగే స‌మ‌యంలో తాను, ఎమ్మెల్యే విజ‌యుడు క‌లిసి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఎస్బీఐ ద్వారా ఓ ఐదు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని ఆ గ్రామాల్లోని స్కూళ్ల‌లో సైన్స్ ల్యాబ్స్, ఫ్రీ ఆర్మీ ట్రైనింగ్, ఆడ‌పిల్ల‌ల‌కు సైకిళ్లు అందించామ‌ని అన్నారు. తామిద్దరం క‌లిసి ఆ కార్య‌క్ర‌మాల‌ను ఉద‌యం 11గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించామ‌న్నారు. తాము అలంపూర్ లో తిరిగేట‌ప్పుడు కానీ బ‌య‌ట కానీ అన్న‌ద‌మ్ముళ్లా ఉంటున్నామ‌న్నారు. తామిద్ద‌రం కూడా షెడ్యూల్ కులాల నుండి గెలిచ‌వాళ్లం అని చెప్పారు.

తాను కాంగ్రెస్ నుండి గెలిస్తే, విజ‌యుడు బీఆర్ఎస్ నుండి గెలిచార‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఒకే పార్టీ నుండి గెల‌వాల‌ని లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రిని గెలిపిస్తే వాళ్లు గెలుస్తారని చెప్పారు. తాను ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లి విజ‌యుడు కూడా వ‌స్తాడ‌ని చెప్పారు. విజ‌యుడు ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లినా తాను కూడా వెళ‌తాన‌ని చెప్పారు. తాను విజ‌యుడుపై దాడి చేయ‌లేద‌ని అలాంటి ఉద్దేశ్యం కూడా లేద‌ని అన్నారు. ప్రోటోకాల్ పాటిస్తూనే స‌క్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. ఇదిలా ఉంటే అలంపూర్ మున్సిపాలిటీలో జ‌రిగిన ఓ అభివృద్ధి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విజ‌యుడు టెంకాయ‌ల సంచి తీసుకోవ‌డంతో మ‌ల్లు ర‌వి అసహ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story