తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుండు.. సీఎం రేవంత్‌పై ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాకట్టు పెడుతున్నాడని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుండు.. సీఎం రేవంత్‌పై ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాకట్టు పెడుతున్నాడని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి టూర్లు వేస్తున్నారని.. 46వ హస్తినకు వెళ్లాడని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా మారిందని ఛలోక్తులు విసిరారు. ఆనాడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను అవమానిస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారని.. నేడు రేవంత్ హైకమాండ్ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఆత్మగౌరవం దెబ్బతింటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని లక్ష్మణ్ అన్నారు.

కాగా, ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో సీఎం సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో క్యాబినెట్‌ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో ఆయన చర్చించారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయించింది. సభ తేదీలను ఖరారు చేయాలని.. వీటికి హాజరుకావాలని ఖర్గే, రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ కోరారు.

Next Story