CM కూతురైనా.. ఢిల్లీ మంత్రి అయినా వదిలేది లేదు: MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
CM కూతురైనా.. ఢిల్లీ మంత్రి అయినా వదిలేది లేదు: MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీబీఐ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ అని, తప్పు చేసిన వారు ఢిల్లీ మంత్రయినా? ముఖ్యమంత్రి కూతురైనా సరే వదిలేది లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సాగుతున్న అవినీతి పాలనపై మేధావులు ఆలోచించాలని సూచించారు. సీఎం కేసీఆర్ భావి తరాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పేదవాడికి గూడు, నిలువు నీడ లేకుండా పోయిందన్నారు.

దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని సర్కార్ అసైన్డ్ భూములు మాత్రం దోచుకుందోని, శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పేదల భూములను లాక్కొని పెద్దోళ్లకు అప్పగిస్తున్నాడని వెల్లడించారు. పేదవాడు కనీసం 100 గజాల భూమి కూడా కొనే పరిస్థితి లేదన్నారు. అవినీతి సొమ్ము మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రానికి వస్తే అదేదో రాష్ట్ర ప్రజలపై దాడి జరిగినట్లుగా టీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కేంద్రం ఇచ్చే అనేక సంక్షేమ పథకాల నిధులను దారి మళ్లించి ఇతర పథకాలను, స్కాంలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ పథకాలన్నీ ఎండాకాలంలో వానలాంటివని లక్ష్మణ్ అన్నారు. ఎవరి ప్రయోజనం కోసం మద్యం రాబడి పెరిగేలా చేశారని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం ఢిల్లీ వరకు వెళ్లిందంటే ఎంతలా అవినీతి జరుగుతుందో ఆలోచించాలన్నారు. తాము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టలేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో తాము తప్పుచేయలేదనుకుంటే పూర్తిగా సహకరించి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

భవిష్యత్‌లో కేసీఆర్ న్యాయస్థానాలను తప్పుబట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆసక్తికర కామెంట్లు చేశారు. బీఎల్ సంతోష్ విషయంలో కోర్టు జడ్జిమెంట్‌కి కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లక్ష్మణ్​ ప్రశ్నించారు. అక్రమ సంపాదన లేకుంటే భయపడాల్సిన పనిలేదని, మరి దర్యాప్తు సంస్థల విచారణలో నోట్ల కట్టలు ఎలా బయట పడుతున్నాయని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed