- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మాట అన్నందుకే ఈటలను బీఆర్ఎస్ నుంచి తరిమేశారు.. MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)పై బీజేపీ(BJP) ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)పై బీజేపీ(BJP) ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు(Chevella Project)ను పూర్తి.. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా చేవెళ్లకు ఒక్క చుక్క నీరు రావడం లేదని అన్నారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కేసీఆర్‌దే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చర్చలో హరీష్ రావు గానీ, ఈటల రాజేందర్ గానీ లేరు అని వెల్లడించారు.
తాను ఈటల రాజేందర్‌కు సపోర్ట్ చేసేందుకు రాలేదు.. నిజాలు చెప్పేందుకు వచ్చానని అన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.. అది వందశాతం తప్పుడు ప్రచారం. ఈటల నిజాన్ని నిర్భయంగా చెప్పే మనిషి అన్నారు. గులాబీ జెండా అందరిది.. ఏ ఒక్కరిది కాదు అన్నందుకే ఈటలను ఆ పార్టీ నుంచి తన్ని తరిమేశారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ తానా అంటే తందానా అనే ఇంజినీర్లు ఉండేవారని ఎద్దేవా చేశారు. ఇందులో ఈటల పాత్ర లేదని స్పష్టం చేశారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.






