Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గాలను చూసి కేసులు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Prasad Jukanti |

కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలు ఏది చేసినా ఒప్పే అవుతోందని కొండా

Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గాలను చూసి కేసులు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళితులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy) విమర్శించారు. మూడు రోజుల క్రితం రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్ డివిజన్ పరిధిలో జంతు కళేబరాలు తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు భగజంగ్ దళ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి చంచల్ గూడా జైలుకు (Chanchal Guda Jail) తరలించడం అన్యాయం అన్నారు. జైల్లో ఉన్న కార్యకర్తలను ఇవాళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులు ఒక వర్గం వారిపై కేసులు పెట్టి అవతలి వర్గం వారిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గం అని స్థానిక ఎమ్మెల్యే అవతలి వర్గం వారికి వత్తాసు పలకడం అవివేకం అన్నారు. ఈ ఘటనకు సంబంధం లేని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం ఉన్నన్ని రోజులు ఇంతేనని, మైనార్టీలు ఏ తప్పుచేసినా అన్ని మాఫీ అవుతాయని ఆరోపించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్న తప్పేనని జంతు వ్యర్థ పదార్థాలను వేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story