- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని సభకు సీఎం కేసీఆర్ ఆబ్సెంట్.. ఎంపీ కోమటిరెడ్డి సీరియస్
by GSrikanth |
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని కొట్లాటలు ఉన్నా ముఖ్యమంత్రి ప్రధాని సభకు వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని సభకు సీఎం హాజరుకాకపోవడం పట్ల శనివారం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మోడీ సభలో సీఎంకు 7 నిమిషాల సమయం కేటాయించారని ఈ టైమ్‌లో రాష్ట్రానికి సంబంధించిన 70 సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లవచ్చని అన్నారు. అడగనిదే అమ్మయినా పెట్టదని.. సీఎం అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. నేను మోడీని పలుమార్లు కలిసి తన నియోజకవర్గానికి నిధులు తెచ్చుకున్నానని గుర్తుచేశారు. ప్రధాని మోడీ, కేసీఆర్ పరస్పరం ఒకరినొకరు తిట్టుకున్నట్లు నటిస్తున్నారని ధ్వజమెత్తారు.
Next Story






