- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకనైనా కేసీఆర్ సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నా: MP కోమటిరెడ్డి
by GSrikanth |
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్ల తరువాత రాజ భవనం లాంటి సెక్రటేరియెట్కట్టుకుని ఇవాళ పలు దస్త్రాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఇకనైనా నిత్యం సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సచివాలయ నిర్మాణానికి రూ.వెయి కోట్లు ఖర్చవుతాయని చెప్పి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హామీలయిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్ ఆయన ఆశయాలను కొనసాగించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
Next Story






