హరిత విప్లవ స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఎంపీ సంతోష్ కుమార్

by Dishafeatures2 |
హరిత విప్లవ స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఎంపీ సంతోష్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కలవాలంటే మొక్క నాటి రావాలని ప్రజలకు పిలుపునిచ్చి హరిత విప్లవానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ ఆలోచన మేరకు మనమంతా మొక్కలు నాటి హరిత భారతావనికి కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే సీఎం కేసీఆర్ ధన్యవాద సభ వాల్ పోస్టర్ ను ప్రగతి భవన్ లో ఆదివారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు, నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, టీపీయూఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు గంగాధర్, వడ్డెర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed