మా దిక్కు దళితులు ఉన్నారని వడ్లు కొంటలేరా.. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్యం అవ్వ‌డంపై పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డంవంశీ కృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. ధాన్యం కొనుగోళ్లు త‌గ్గించ‌డంతో రైతులు రోడ్డుపైకి వ‌స్తున్నార‌ని అన్నారు.

మా దిక్కు దళితులు ఉన్నారని వడ్లు కొంటలేరా.. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్యం అవ్వ‌డంపై పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డంవంశీ కృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. ధాన్యం కొనుగోళ్లు త‌గ్గించ‌డంతో రైతులు రోడ్డుపైకి వ‌స్తున్నార‌ని అన్నారు. ఎఫ్ సీఐ ధాన్యం కొనుగోళ్లు భారీగా త‌గ్గించింద‌న్నారు. కేంద్రంలోని బీజేపీనే కొనుగోళ్లు త‌గ్గించేలా చేసి మ‌ళ్లీ తామే రైతుల‌కు అండ‌గా ఉంటున్నామ‌ని డ్రామా ఆడుతోంద‌ని విమ‌ర్శించారు. పెద్ద‌ప‌ల్లిలో ఆరు ల‌క్ష‌ల ట‌న్నుల మిల్లింగ్ కెపాసిటీ ఉంటే గ‌తంలో మంచిర్యాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేశార‌న్నారు.

కానీ ఈసారి ఎందుకు కొన‌డంలేద‌ని ప్రశ్నించారు. ఎవ‌రి ఆదేశాలమేర‌కు కొనుగోలు నిలిపివేశార‌ని ప్ర‌శ్నించారు. మంచిర్యాల‌ను ఒక‌లా పెద్ద‌ప‌ల్లిని ఒక‌లా చూస్తున్నార‌ని ఇక్క‌డ ప‌ద్ధ‌తి బాగోలేద‌ని తాను చీఫ్ సెక్ర‌ట‌రీకి కూడా లేఖ రాశాన‌న్నారు. మంచిర్యాల జిల్లాలో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు ఎక్కువ ఉన్నాయ‌ని ద‌ళితుల పంట మీకు వ‌ద్దా అని ప్ర‌శ్నించారు. ఆ ఉద్దేశంతోనే కొనుగోళు చేయ‌డంలేదా అని మండిప‌డ్డారు. మ‌రోసారి ఈ అంశంపై చీఫ్ సెక్ర‌ట‌రీకి లేఖ రాస్తాన‌ని రివ్యూ తీసుకుంటాన‌ని అన్నారు.

Next Story