- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నోటీసులు ఎవరికి ఇవ్వాలో కూడా తెల్వదా.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులను అందుకున్న మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌కు ఇవాళ ఉదయం హైదారాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులను అందుకున్న మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు కేటాయించడం మాత్రమే తన పని అని స్పష్టం చేశారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదా అంటూ కమిషన్‌ను ఆయన తప్పుబట్టారు. కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని కామెంట్ చేశారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే తనకు నోటీసులు ఎలా ఇస్తారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
కాగా, కాళేశ్వరం అవకతవకలపై జస్టీస్ పి చంద్రఘోష్ కమిషన్ ఎంపీ ఈటల రాజేందర్‌ను కాసేపట్లో ప్రశ్నించనుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఎడీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈటలకు ప్రశ్నలు సంధించనున్నారు. కంప్లీషన్ సర్టిఫికెట్, నిధులు, బ్యాంక్ గ్యారంటీల విడుదలకు సంబంధించిన అంశాలు విచారణకు రానున్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ అంచనాల పెంపుపై కూడా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది.






