హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే అదొక్కటే మార్గం.. MP ఈటల కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్(Hyderabad) నగరం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు.

హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే అదొక్కటే మార్గం.. MP ఈటల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) నగరం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. సోమవారం ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రమూకలు బాంబు దాడులు చేశాయని.. కానీ ఇప్పుడు దేశంవైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారని అన్నారు. అంతేకాదు.. మోడీ(PM Modi) ప్రధాని అయ్యాక నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయని.. ఇతర దేశాలతో అద్భుతమైన సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాల పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిధులు అందుతున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లకు కేంద్ర నిధులు అందుతున్నాయని అన్నారు. కేంద్ర నిధులతోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర సహాకారంతో చర్లపల్లి, సికింద్రబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. కొంపల్లి, అంబర్‌పేట్, ఎల్బీనగర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం రూ. వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి ఓటు వేస్తే.. మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లు అవుతుందని అన్నారు. దయచేసి ఓటు వేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా.. తర్వాత స్థానంలో భాజపా ఉంది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు ఉండగా.. 31 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నారు.

Next Story