- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పటివరకూ సహకారం అందించండి.. కేంద్రానికి MP ఈటల రిక్వెస్ట్
భారతదేశంలో యువశక్తి చాలా ఎక్కువ ఉందని, ఐటీ, ఉత్పత్తి, సర్వీస్ రంగాల్లో పనిచేసేవారికి నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలో యువశక్తి చాలా ఎక్కువ ఉందని, ఐటీ, ఉత్పత్తి, సర్వీస్ రంగాల్లో పనిచేసేవారికి నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. సోమవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు భారత ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఏమిటో వివరించాలన్నారు. పాస్పోర్టు తీసుకున్న దగ్గరనుండి వీసా వరకు, మంచి కంపెనీలలో ఉద్యోగం ఇప్పించడం వరకు ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించాలని కోరారు.
ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థులు గుర్తింపు, ధృవీకరణ లేని కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ జైలుపాలు కాకుండా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చెప్పాలన్నారు. అదే విధంగా వ్యవసాయ, డైరీ లాంటి లైవ్ స్టాక్ పథకాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకోవడం లేదని వెంటనే అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 2047 వికసిత్ భారత్ కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు యువతకు అవసరమైన రుణాలు బ్యాంకులు ఇవ్వడానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని దానికి సంబంధించిన వివరాలు కూడా సభకు తెలిపాలని పేర్కొన్నారు.






