Etala Rajender: బాలాపూర్ లడ్డూతో ఎంపీ ఈటల రాజేందర్.. అభిమానాన్ని చాటిన దశరథ్ గౌడ్

by Ramesh Naini |

ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి ఈటల తలపై లడ్డూను ఉంచి తమ అభిమానాన్ని దశరథ్ గౌడ్ చాటుకున్నారు.

Etala Rajender: బాలాపూర్ లడ్డూతో ఎంపీ ఈటల రాజేందర్.. అభిమానాన్ని చాటిన దశరథ్ గౌడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Utsav Samiti) ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఎంపీ ఈటల రాజేందర్ గణేశ్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హైదరాబాదులో 46 ఏళ్ల క్రితం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వేలమంది ప్రజలు, పూజలతో మొదలైందన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి గ్రామంలో బస్తీలో గణేశ్ ఉత్సవ కమిటీ నాయకత్వంలో గణేశ్ మండపాలను స్థాపించి తొమ్మిది రోజులు పాటు గ్రామాలు బస్తీల్లో కుటుంబ సభ్యులు లాగా పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

గణేశ్ ఉత్సవ కమిటీ ఆనాడు వేల మందితో స్టార్ట్ అయిందని ఈ నాడు కోట్ల మంది ప్రజలతో మన పండుగలను, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం భరతమాత ముద్దు బిడ్డలం అనే ఐక్యత, చైతన్యం సంతరించుకుంటుందన్నారు. ఈ ఒరవడి ఇలానే కొనసాగాలని కోరుకుంటూ కోట్ల మంది భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

బాలాపూర్ లడ్డూతో ఎంపీ ఈటల రాజేందర్..

ప్రతిష్టాత్మక (Balapur laddu) బాలాపూర్ లడ్డూను వేలం పాటలో లింగాల దశరథ్ గౌడ్ గెలుచుకున్నారు. ఈ శుభసందర్భంలో ఈటల రాజేందర్‌ను కలిసి ఈటల తలపై లడ్డూను ఉంచి తమ అభిమానాన్ని దశరథ్ గౌడ్ చాటుకున్నారు. లడ్డూకు దండం పెట్టి నెత్తిన పెట్టుకొన్న ఈటల రాజేందర్ దశరథ్ కి విషెస్ తెలిపారు.

Next Story