టన్నెల్ ప్రమాదంపై అధికారిక ప్రకటన చేయండి.. MP ఈటల డిమాండ్

by Gantepaka Srikanth |

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టన్నెల్ ప్రమాదంపై అధికారిక ప్రకటన చేయండి.. MP ఈటల డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. ప్రమాదంపై అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కాగా, నాగర్‌కర్నూల్‌(Nagarkurnool) జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీశైలం(Srisailam) ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్‌ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది.

ఈ అనూహ్య ప్రమాదంలో పలువురు కార్మికులు గాయాలపాలయ్యారు. గమనించిన తోటి కార్మికులు వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా సొరంగంలో ఏడుగురు కార్మికులు చిక్కుకున్నారు. సొరంగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమదం జరిగిన ఉదయం షిఫ్ట్‌లో పనులకు 50 మంది కార్మికులు వెళ్లగా.. 43 మంది కార్మికులు బయటకు వచ్చారు. మిగిలిన ఏడుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story