'అమ్మ రాజీనామా' సంఘటన.. ఎంపీ ఈటల రాజేందర్ ఎమోషనల్ ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2026-02-02 14:53:30  IST  )

ఇటీవల చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన తల్లి, ఇంటర్‌ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది.

అమ్మ రాజీనామా సంఘటన.. ఎంపీ ఈటల రాజేందర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన తల్లి, ఇంటర్‌ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చానీయంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కన్నతల్లి, కడుపున పుట్టిన బిడ్డల మరణం వర్ణించలేనంత మానసిక వేదనను కలిగించింది. ఈ 'అమ్మ రాజీనామా' సంఘటన సమాజం అంతరాత్మను కదిలించాలి, లేదంటే మన సామూహిక జీవన విధానానికే అర్థం లేకుండా పోతుంది’ అని పేర్కొన్నారు.

జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి

జీవితాన్ని ప్రేమించండి.. నిరాశను ద్వేషించండి అని ఈటల ప్రజలకు సూచించారు. మరణం దేనికీ పరిష్కారం కాదని, అది కేవలం ఒక తీరని శూన్యం మాత్రమేనని అన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, 'ఆత్మనిర్భరత'తో పోరాడదాం.. చుట్టూ ఉన్న పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకుందామని కోరారు. బ్రతుకు విలువ తెలుసుకుందాం.. ఆఖరి వరకు జీవిద్దాం.. అని పిలుపునిచ్చారు.

కాగా, బోడుప్పల్‌ నివసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన విజయశాంతి రెడ్డి (38) కుమార్తె చైతన్య రెడ్డి(18) కుమారుడు విశాల్‌ రెడ్డి(17) శనివారం తెల్లవారు జామున చర్లపల్లి-ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ల ఒకరినొకరు హత్తుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. విజయశాంతి రెడ్డి భర్త సురేందర్‌ రెడ్డి దుబాయిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Next Story