బతుకమ్మ పండుగ: తెలంగాణ మహిళలకు MP డీకే అరుణ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30 తేదీ వరకు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబరాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) తెలంగాణ మహిళా(Telangana Womens) లోకానికి పిలుపునిచ్చారు.

బతుకమ్మ పండుగ: తెలంగాణ మహిళలకు MP డీకే అరుణ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 30 తేదీ వరకు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబరాలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna) తెలంగాణ మహిళా(Telangana Womens) లోకానికి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని వారి నివాసంలో సంస్కార భారతి తెలంగాణ మాతృ శక్తి విభాగం వారితో కలిసి బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలంతా కలిసి మెలసి బతుకమ్మను ఆడుతూ మన సంస్కృతిని చాటుదాం అని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి మాతృ శక్తి రాష్ట కన్వీనర్ శ్రీమతి నెల్లుట్ల సుష్మా, సంస్కార భారతి రాష్ట కార్యదర్శి శ్రీమతి భవాని, రంగోలి విభాగం కన్వీనర్ శ్రీమతి జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి విజయలక్ష్మీ, యాక్టింగ్ విభాగం రాష్ట కో కన్వీనర్ శ్రీమతి స్వాతి, శ్రీమతి లావణ్య, శ్రీమతి సంతోషి, శ్రీమతి పారిజాత, శ్రీమతి శ్రీవిద్య, శ్రీమతి లావణ్య, శ్రీమతి నర్మద తదితరులు పాల్గొన్నారు.

Next Story