గవర్నర్‍ శివ ప్రతాప్ శుక్లాతో డీకే అరుణ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2026-04-03 07:37:26  IST  )

మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు రావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఎంపీ డీకే అరుణ కోరారు.

గవర్నర్‍ శివ ప్రతాప్ శుక్లాతో డీకే అరుణ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను(Governor Shiva Pratap Shukla) బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆహ్వానించారు. ఇవాళ లోక్‍భవన్‍లో తెలంగాణ గవర్నర్‍తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్ కు డీకే అరుణ వివరించారు. 24వ తేదీన మహబూబ్ నగర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

Next Story