- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక అభివృద్ధికి రోడ్ల కనెక్టివిటీ చాలా కీలకం: డీకే అరుణ
ఆర్థిక అభివృద్ధికి రోడ్ల కనెక్టివిటీ చాలా కీలకం: డీకే అరుణ

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్(Shivraj Singh Chouhan)తో పార్లమెంట్ భవనంలోని వారి ఛాంబర్‌లో బీజేపీ నాయకురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట జిల్లాలో వివిధ గ్రామాలలో కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. రోడ్ల కనెక్టివిటీ అభివృద్ధి పనుల ప్రాధాన్యాన్ని వివరించారు. నారాయణపేట జిల్లా పరిధిలో పీఎంజీఎస్వై-IV కింద 24 గ్రామ పంచాయతీలను గుర్తించి గతంలో ప్రతిపాదన సమర్పించారు. వీటిలో 13 గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లకు ఇప్పటికే డీపీఆర్ల తయారీ కోసం ఎన్ఆర్ఐడీఏ ఆమోదించింది. మిగిలిన 11 గ్రామాలకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమోదం పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు.
మక్తల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. రోడ్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆయా గ్రామాలలో నివసించే ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం యొక్క సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి రోడ్ల కనెక్టివిటీ చాలా కీలకమని చెప్పారు. అందువల్ల మిగిలిన 11 గ్రామాలకు వీలైనంత త్వరగా ఎన్ఆర్ఐడీఏ ఆమోదం తెలపాలని మరియు మక్తల్ నియోజకవర్గంలోని మొత్తం 24 గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లకు సంబంధించిన డీపీఆర్ తయారీని ప్రారంభించాలని, సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కోరారు. దీనిపై ఆయన ఎంతో సానుకూలంగా స్పందించినట్లు డీకే అరుణ చెప్పారు.






