- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రెండు దేశాల్లో బంధీలుగా భారత యువత: ఎంపీ అర్వింద్
ఆ రెండు దేశాల్లో బంధీలుగా భారత యువత: ఎంపీ అర్వింద్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి విదేశాల్లో యువతను బంధీలుగా మార్చుతున్న గ్యాంగులను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా యువతను థాయ్ లాండ్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు ఏజెంట్లు వసూలు చేస్తున్నారని అర్వింద్ పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరేందుకు అక్కడికి వెళ్లిన వెంటనే వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకుని హింసిస్తున్నారని అన్నారు. ఈ నేరాలకు స్థానిక మిలీషియా, సైన్యంలో కొందరు లంచాలు తీసుకుని సహకరిస్తున్నందున రక్షణ చర్యలు మరింత కష్టతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముఠాకు బలైన వారిలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఉన్నారని, వారంతా ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయి ఉన్నారని ఆయన హౌజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, ఆయా దేశాల్లో చిక్కుకున్న భారతీయ నిరుద్యోగ యువకులను రక్షించి, వారిని తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని అర్వింద్ కోరారు.






