MP Dharmapuri Arvind: కేసీఆర్ తో ఆ నలుగురు నాలుగు స్తంభాలాట.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Dharmapuri Arvind: కేసీఆర్ తో ఆ నలుగురు నాలుగు స్తంభాలాట.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ (KCR) తో కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని వీరి నలుగురి మధ్య కేసిఆర్ నలిగిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ అపోజిషన్ లీడర్ ఎందుకు అయ్యారని నిలదీశారు. మైక్ ఇవ్వలేదని మొత్తుకుంటున్నా కేసీఆర్ ముందు అసెంబ్లీకి వెళ్ళు ఆ తర్వాత మైక్ గురించి మాట్లాడు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాం (Statue of Telangana Mother) మీద రాజకీయం చేయడం దురదృష్టకరం అని ఈ పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని కాళేశ్వరంతో ఒక్క ఎకరా పారలేదన్నారు. కేసీఆర్ ఓ వేస్ట్ ఫెల్లో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ (Revanth Reddy), కేసీఆర్ ఇద్దరూ దుర్మార్గులేనని దుయ్యబట్టారు.

వర్క్ చేయనోడు వర్కింగ్ ప్రెసిడెంట్:

కేటీఆర్ ఎవరు? ఆఫ్ట్రల్ ఎమ్మెల్యే మాత్రమే ఆయన గురించి ఏం క్వచ్చన్స్ అడుగుతారన్నారు. వాళ్ల పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలలో కేటీఆర్ (KTR) ఒక్క ఎమ్మెల్యే మాత్రమేనని వర్క్ చేయనోడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని సెటైర్ వేశారు. కేటీఆర్, కవితకు కుక్క కూడా ఓటేయదని అర్వింద్ మరోసారి విమర్శలు గుప్పించారు. యాదగిరి గుట్ట మీద కేసీఆర్ ముక్కు , కారు గుర్తు చెక్కించుకున్నారని దయ్యబట్టారు. కవిత ఆక్టివ్ పాలిటికిస్ లోకి వస్తె ఏం చేయమంటారు? ఆమెను చూసి గజ గజ వణికిపోవాలా? అని ప్రశ్నించారు.

పసుపుబోర్డుపై అవాస్తవాలు:

అర్వింద్ కు ఎప్పుడు ఏ గేర్ లో బండి నడపలో తెలుసు అని పసుపు బోర్డు నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలి వెళ్లిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయాలపై మినిమం ద్యాస పెట్టడం లేదని అర్వింద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నెగ్లిజెన్స్ వల్లే ఎయిర్ పోర్టు పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అదిలాబాద్, నిజామాబాద్ కు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం శాంక్షన్ అయ్యిందని చెప్పారు. విమానాశ్రయం వచ్చే జక్రాన్ పల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు కేటాయించిన ప్రధాని మోడీ (PM Modi)కి ధన్యవాదాలు చెప్పారు. ఇందులో 2 నిజామాబాద్ పార్లమెంట్ కి కేటాయించారని, తొందర్లోనే నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం సైతం రానుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 25 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రేవంత్ ను ఇచ్చిన వాగ్దానాలను అడిగితే నడ్డాపై విమర్శలు చేస్తున్నారని హైదరాబాద్ ను నాశనం చేసి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. దీని వెనకున్న కుట్ర ఏంటన్నారు. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత రెండు పార్టీలకు లేదని హైడ్రా పేరుతో జేసీపీలతో బ్లాక్ మెయిల్ చేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Next Story