- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dharmapuri Arvind: తమాషాలు చేస్తున్నారా? కవిత రాజీనామా విషయంలో గుత్తాపై ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాజీనామాపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) విమర్శిచారు. చైర్మన్ ఫార్మాట్‍లో రాజీనామా సమర్పించినా ఆమోదించకుండా ఎందుకు ఆపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కవితకు ఉన్న ములాఖత్ ఏమిటి అని ప్రశ్నించారు. గుత్తా సుఖేందర్ చెంచాగిరి చేయవద్దని వెంటనే కవిత రాజీనామాను ఆమోదించాలన్నారు. కవిత రాజీనామా పంపిస్తే చైర్మన్ కవితకు ఫోన్ చేసి రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని అవన్ని మీకేందుకు? అని ప్రశ్నించారు. తాను చైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని కవిత చెబుతుంటే రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా తమాషాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. ఇవాళ నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కవిత రాజీనామాకు సంబంధం లేదని, సుప్పీంకోర్టు నిబంధనల ప్రకారం కవిత రాజీనామాను ఆమోదించకుండా ఆపే అధికారం చైర్మన్ కు లేదన్నారు. ఆమె రిజిగ్నేషన్‍ను వెంటనే ఆమోదించాలని చైర్మన్ కు లేఖను పంపించబోతున్నామన్నారు. కవిత, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వ్యాపారలావాదేవీలు ఉన్నాయని అందువల్లే ఆమె రాజీనామా ఆమోదించడం లేదన్నారు.
కవిత తన బిజినెస్ పార్టన్ రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయిస్తే బీసీ రిజర్వేషన్లు వస్తాయన్నారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు వస్తాయని జాగృతి జనం బాటలో చేసిన ఆరోపణలపై స్పందించిన అర్వింద్.. కవితన పార్టీ నుంచి తండ్రి బయటకు పంపితే మీ అన్న ఇంట్లో నుంచి బయటకు పంపించారని ఇంటి నుంచి బయటకు పంపిన కవిత తన ప్రస్టేషన్ అంతా బీజేపీపై చూపిస్తోందని ధ్వజమెత్తారు. కవితను కన్న రక్తమే ఆమెను కాదనుకుంటోంది. మీరు చేసిన అవినీతి అందరు చేస్తారనుకోవద్దు. మాధవనగర్ ప్లైఓవర్‍కు మీ బిజినెస్ పార్టన్ రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడం లేదన్నారు. కవిత భయానికి నిజామాబాద్ లో కాంట్రాక్టర్లు పారిపోయారు. నీ దిక్కుమాలిన చరిత్ర ప్రజల ముందు ఉంచాను కాబట్టే నీ గతి ఇలా మారిందన్నారు. కవిత జాగృతి యాత్ర తిహార్ జైలుకా? అని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్ మెంట్ ఆపింది ఎవరు? ఈ జాతుల పిల్లలు చదువుకుంటే జీర్ణించుకోలేని కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించారు.






